Andhra Pradesh: చంద్రబాబు గిమ్మిక్కులు ఆపాలి: వైసీపీ నేత బొత్స

  • ఐదేళ్లలో ఏం చేశారో బాబు చెప్పాలి?
  • నల్ల చొక్కాలు ధరించి నాటకాలాడుతున్నారు
  • ‘ప్రత్యేక హోదా’కు ఏ రాష్ట్రం మద్దతిచ్చినా తీసుకుంటాం
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గిమ్మిక్కులు ఆపాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఐదేళ్లలో చంద్రబాబు సీఎంగా ఏం చేశారో చెప్పలేకపోతున్నారని, ఏపీని దోచుకుంది తప్ప, చేసిందేమీ లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలే వైసీపీకి ముఖ్యమని, ఏపీకి ‘ప్రత్యేక హోదా’ సాధన విషయమై కేసీఆర్ మద్దతు తెలుపుతానంటే వద్దని చెప్పాలా? అని ప్రశ్నించారు.

 ఏపీకి ‘ప్రత్యేక హోదా’ కోసం ఏ రాష్ట్రం మద్దతిచ్చినా తీసుకుంటామని అన్నారు. తెలంగాణలో మాదిరిగా ఏపీలోనూ టీడీపీ కనుమరుగవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ ని అంగీకరిస్తూ చంద్రబాబు గతంలో రాసిన లేఖను కేంద్ర మంత్రి బయటపెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు నల్లచొక్కాలు ధరించి చంద్రబాబు నాటకాలాడుతున్నారని దుయ్యబట్టారు.
Andhra Pradesh
Chandrababu
YSRCP
Botsa Satyanarayana

More Telugu News