Nara Lokesh: నారా లోకేశ్ నామినేషన్ పై అభ్యంతరం.. గడువు ఇచ్చిన అధికారులు

  • కృష్ణా జిల్లా నోటరీ సమర్పించిన ఏపీ మంత్రి
  • మంగళగిరిలో చెల్లదన్న అధికారులు
  • లోకేశ్ కు 24 గంటల గడువు
ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో దాఖలు చేసిన నామినేషన్ పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆయన దాఖలు చేసిన నామినేషన్ చెల్లదంటూ అధికారులు స్పష్టం చేశారు. నామినేషన్ లో భాగంగా నారా లోకేశ్ సమర్పించిన కృష్ణా జిల్లా నోటరీ గుంటూరు జిల్లా మంగళగిరిలో చెల్లదని అధికారులు అభ్యంతరం తెలిపారు. నోటరీ చట్టంలోని సెక్షన్-9 ను ఈ సందర్భంగా అధికారులు ఉదహరించారు. అయితే, సరైన పత్రాలు సమర్పించేందుకు నారా లోకేశ్ కు ఎన్నికల రిటర్నింగ్ అధికారి 24 గంటలు గడువు ఇచ్చారు.
Nara Lokesh
Andhra Pradesh
Telugudesam

More Telugu News