mohan babu: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మోహన్ బాబు

  • మోహన్ బాబును సాదరంగా ఆహ్వానించిన జగన్
  • ప్రజలకు జగన్ మంచి చేస్తారనే నమ్మకం ఉంది
  • మూడేళ్ల క్రితమే నన్ను జగన్ ఆహ్వానించారన్న మోహన్ బాబు 
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు వైసీపీలో చేరారు. హైదరాబాదులోని లోటస్ పాండ్ కు వెళ్లిన ఆయన జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మోహన్ బాబుకు జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ, ప్రజలకు జగన్ మంచి చేస్తారనే నమ్మకంతోనే వైసీపీలో చేరానని చెప్పారు. వాస్తవానికి మూడేళ్ల క్రితమే వైసీపీలో చేరాలని అనుకున్నానని తెలిపారు. మూడేళ్ల క్రితమే తనను జగన్ ఆహ్వానించారని చెప్పారు. ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేస్తానని తెలిపారు.
mohan babu
jagan
ysrcp
join

More Telugu News