pradeep: జంధ్యాల గారికి నేను ఎప్పటికీ రుణపడి వుంటాను: సీనియర్ నటుడు ప్రదీప్

  • జంధ్యాల గారు నా గురువు 
  • హీరోగా నన్ను పరిచయం చేశారు
  •  ఎలా బతకాలో నేర్పించారు
తెలుగు తెరపై జంధ్యాల హాస్యాన్ని పరుగులు తీయించారు. ఎంతోమంది నటీనటులను ఆయన తన సినిమాల ద్వారా పరిచయం చేశారు. అలాంటివారి జాబితాలో మనకి ప్రదీప్ కూడా కనిపిస్తారు. ఇటీవల వచ్చిన 'ఎఫ్ 2' సినిమాలో 'అంతేగా అంతేగా' అనే డైలాగ్ తో ఆయన మరింత పాప్యులర్ అయ్యారు. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ హాస్య బ్రహ్మ జంధ్యాల గారి గురించి ప్రస్తావించారు.

"జంధ్యాల గారు తెలుగు తెరకి నన్ను హీరోగా పరిచయం చేశారు. ఆయన దర్శకత్వంలో హీరోగా మూడు సినిమాలు చేశాను. ఆ మూడు సినిమాలే 36 యేళ్ల పాటు నేను ముందుకు సాగడానికి దోహదమయ్యాయి. ఆకలి మీద ఉన్నవాడికి చేపల కూర ఎవరైనా పెడతారు. కానీ నాకు నా గురువు చేపలు పట్టడం నేర్పించాడు. ఇన్నేళ్లలో ఆకలి అనేది లేకుండా చేశాడు. ఆయనకి నేను ఎప్పటికీ రుణపడి వుంటాను" అని చెప్పుకొచ్చారు. 
pradeep
ali

More Telugu News