Chandrababu: నేను బతికి ఉండగా అలా జరగనివ్వను: చంద్రబాబు

  • నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో చంద్రబాబు సుడిగాలి పర్యటన
  • ఏపీని తెలంగాణకు బానిసగా మార్చాలని జగన్ కుట్ర
  • జగన్ ముసుగులో మరోమారు దాడి జరుగుతోందన్న చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం చిత్తూరు జిల్లా సత్యవేడు, నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు, ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ, ఒంగోలు నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు వైసీపీ అధినేత జగన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మొన్నటికి మొన్న కట్టుబట్టలతో మనల్ని బయటకు గెంటేసిన వాళ్లు.. ఇప్పుడు జగన్ ముసుగులో మరోసారి రాష్ట్రంపై దాడికి వస్తున్నారంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రుల ఆత్మాభిమానంపై జగన్, కేసీఆర్‌లు కలిసి దాడి చేస్తున్నారని విరుచుకుపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణకు బానిసగా చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన చంద్రబాబు.. తాను బతికి ఉన్నంత వరకు అలా జరగనివ్వనని అన్నారు. ఏపీని తెలంగాణకు మించిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. వేల కోట్ల రూపాయలు లూటీ చేసి, 31 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్ ఇప్పుడు ఓట్ల దొంగగా మారారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే జగన్‌కు ఈ విద్య నేర్పారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
Chandrababu
Andhra Pradesh
Telangana
KCR
Jagan
YSRCP

More Telugu News