Chandrababu: చంద్రబాబుకు, జగన్ కు కొత్త తరం భవిష్యత్తుపై ఆలోచనే లేదు: పవన్ కల్యాణ్

  • చంద్రబాబుకు లోకేశ్, జగన్ కు తన గురించిన ఆలోచనే
  • జగన్ ని తరతరాలు గుర్తుపెట్టుకోవాలట
  • ‘నిరుద్యోగ భృతి’ ఇచ్చి చేతులు దులుపుకుంటే చాలదు
చంద్రబాబుకు లోకేశ్ గురించి, జగన్ కు తన గురించి ఆలోచించుకోవడమే తప్ప, కొత్త తరం భవిష్యత్ గురించిన ఆలోచనే లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. గుంటూరు జిల్లా వేమూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, జగన్ ఫొటో ప్రతి ఇంట్లో ఉండాలని, తరతరాలు గుర్తుపెట్టుకోవాలన్నది ఆయన కోరిక అని, ఇక, చంద్రబాబు తన కొడుకు లోకేశ్ ను ఎలా ముఖ్యమంత్రిని చేయాలన్నా దానిపైనే ధ్యాస తప్ప వేరే దానిపై లేదని విమర్శించారు. కొత్త తరం గురించి  ఆలోచన, యువతకు ఉద్యోగావకాశాలు ఎలా కల్పించాలన్న దానిపై మనసు పెట్టడం లేదని దుయ్యబట్టారు. ఉద్యోగాలు రావట్లేదని యువత గొడవ చేస్తే ‘నిరుద్యోగ భృతి’ ఇచ్చి చేతులు దులుపుకుందామన్న ఆలోచన తగదని సూచించారు.
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
Pawan Kalyan

More Telugu News