Harish Rao: స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో హరీశ్‌కు చోటు!

  • స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల
  • హరీశ్ పేరు లేకపోవడంతో విస్మయం 
  • రజత్‌కు లేఖ రాసిన టీఆర్ఎస్
టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల తొలి జాబితాలో సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు పేరు లేని విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా 20 మంది జాబితాలో ఉన్నారు. అయితే ఆ జాబితాలో హరీశ్ పేరు లేకపోవటం విస్మయం కలిగింది. ఈ విషయమై టీఆర్ఎస్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్‌కు ఈ రోజు లేఖ రాసింది. దీంతో టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో హరీశ్ పేరును కూడా చేర్చారు. రజత్ కుమార్‌కు లేఖ రాసిన టీఆర్ఎస్, ఎంపీ సంతోష్ కుమార్ స్థానంలో హరీశ్ పేరును చేర్చాలని కోరింది. టీఆర్ఎస్ విజ్ఞప్తి మేరకు హరీశ్ పేరును కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఈసీ జత చేసింది.
Harish Rao
KCR
KTR
TRS
Telangana
Rajath Kumar
Santhosh kumar

More Telugu News