Sonia Gandhi: చంద్రబాబు పిలుపు మేరకు ఆంధ్రాలో ప్రచారంలో పాల్గొంటా: దేవెగౌడ

  • సెక్యులర్ పార్టీల కోసం ఎక్కడికెళ్లేందుకైనా సిద్దం
  • రాహుల్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం
  • దేశంలోని అన్ని చోట్లా ప్రచారంలో పాల్గొంటా
కర్ణాటకలోని తుంకూరు లోక్‌సభ నియోజకవర్గానికి నేడు జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సెక్యులర్ పార్టీల గెలుపు కోసం తాను ఎక్కడికి వెళ్లేందుకైనా సిద్ధమన్నారు. తనను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారానికి ఆహ్వానించారని, కాబట్టి ప్రచారంలో తప్పక పాల్గొంటానని తెలిపారు.

కర్ణాటకలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, 37 సీట్లు వచ్చినప్పటికీ తమకు కాంగ్రెస్ పార్టీ సీఎం సీటు ఇచ్చిందని పేర్కొన్నారు. తమవి సెక్యులర్ పార్టీలని, ఎక్కడ తమ అవసరం ఉన్నా అక్కడకు వెళ్లి తప్పనిసరిగా ప్రచారంలో పాల్గొంటామని దేవెగౌడ వెల్లడించారు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి తరుపున దేశంలోని అన్ని చోట్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానన్నారు. అలాగే చంద్రబాబు పిలుపు మేరకు ఆంధ్రాకు కూడా వెళతానని దేవెగౌడ వెల్లడించారు.
Sonia Gandhi
Rahul Gandhi
Devegowda
Chandrababu
Congress
Karnataka

More Telugu News