YSRCP: రోజా మాటలు, భావాలనే షర్మిళ కూసింది: సాధినేని యామిని

  • రోజాకు, షర్మిళకు ఏమాత్రం తేడా లేదు
  • రోజా మాటలను రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోవట్లేదు
  • అమరావతి గురించి లేనిపోని వ్యాఖ్యలు తగదు
సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైసీపీ నాయకురాలు షర్మిళకు, అదే పార్టికి చెందిన మరో నాయకురాలు రోజాకు ఏమాత్రం తేడా లేదని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని విమర్శించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, వాళ్లిద్దరి మధ్య తేడా లేదని ఎందుకన్నానంటే, రోజా మాటలను రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోవట్లేదని, రోజా మాటలు, భావాలనే షర్మిళ కూసిందని ఎద్దేవా చేశారు. మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి ఆర్కే ఓడిపోవడం ఖాయమని, ఈ విషయం తెలిసిన షర్మిళ, రాజధాని అమరావతి గురించి, పోలవరం ప్రాజెక్టుపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
YSRCP
Roja
Sharmila
Telugudesam
saminenei

More Telugu News