Andhra Pradesh: ముగిసిన నామినేషన్ల గడువు... రేపటి నుంచి నామినేషన్ల పరిశీలన
- రేపటి నుంచి నామినేషన్ల పరిశీలన
- తుదిరోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు
- ఈనెల 28వరకు ఉపసంహరణకు అవకాశం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నామినేషన్ల దాఖలు పర్వం ముగిసింది. మార్చి 25 తుదిగడువు కావడంతో ఆఖరిరోజున కూడా గణనీయంగా నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా, రేపటి నుంచి నామినేషన్ల పరిశీలన జరపనున్నారు. మార్చి 28 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్ సభ స్థానాలకు, తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. ఏప్రిల్ 11న తొలి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.