ka paul: కేఏ పాల్ చాలా గొప్ప వ్యక్తి.. ఆయన గురించి చులకనగా మాట్లాడటం సరికాదు: నాగబాబు

  • ఎందరో గొప్ప వ్యక్తులతో తిరిగిన చరిత్ర పాల్ ది
  • ఒక వ్యక్తిని పైకి తీసుకొచ్చేందుకు... పాల్ ను అశక్తుడిని చేశారు
  • పాల్ లాంటి వ్యక్తులకు రాజకీయ రంగం సరైంది కాదు
ప్రజాశాంతి పార్టీ అధినేత, క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ చాలా గొప్ప వ్యక్తి అని సినీ నటుడు, జనసేన నాయకుడు నాగబాబు కితాబిచ్చారు. ఒక మతానికి సంబంధించి ప్రపంచం మొత్తానికి ఆయన తెలుసని, ఎందరో గొప్ప వ్యక్తులతో ఆయన తిరిగారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఆయనపై కుట్రలు జరిగాయని... మరో వ్యక్తిని పైకి తీసుకువచ్చేందుకు, పాల్ ను నిస్సహాయుడిని చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయనకున్న అన్ని వనరులను కట్ చేసి, అశక్తుడిని చేశారని అన్నారు. తన సోదరుడి మర్డర్ కేసు నుంచి కూడా కేఏ పాల్ నిర్దోషిగా బయటపడ్డారని చెప్పారు. పాల్ గురించి చులకనగా మాట్లాడటం సరికాదని అన్నారు. ఎంతో మానసిక వేదనను అనుభవించిన కేఏ పాల్... కాలక్రమంలో కొంత స్థిరత్వాన్ని కోల్పోయారని అన్నారు. పాల్ లాంటి వ్యక్తులకు రాజకీయ రంగం సరైంది కాదని చెప్పారు.
ka paul
nagababu
prajashakthi party
janasena

More Telugu News