Vijay Sai Reddy: ప్రశ్నిస్తానని వచ్చి లాలూచీ పడ్డాడు.. జనసేనానిపై విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు

  • దొంగలతో కలిసిపోయాడు
  • అవినీతి సొమ్ముకు కాపలాకుక్కలా మారాడు
  • ట్విట్టర్‌లో ఆరోపించిన వైసీపీ నేత
ప్రశ్నిస్తానంటూ వచ్చి అధికార పార్టీతో లాలూచీ పడ్డాడని, వారి అవినీతి సొమ్ముకు కాపలా కుక్కలా మారిపోయాడని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ప్రజలు విడిచిపెట్టరని, దుడ్డుకర్రతో వెంటపడతారని హెచ్చరించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్టింగ్‌ పెట్టారు.

నిటారుగా, నిక్కచ్చిగా నిలబడాల్సిన ప్రశ్న మోచేతి నీళ్లు తాగేందుకు అడ్డంగా వంగిపోయిందని విమర్శించారు. ఓటమి తప్పదని అర్థమైపోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుబంధ పార్టీలు దేనికైనా తెగించేందుకు సిద్ధమయ్యాయని ధ్వజమెత్తారు. ఎన్నికలు వాయిదా వేయించే ప్రయత్నం చేస్తారని, వైసీపీ కేడర్‌ సహనంతో ఉండాలని సూచించారు. దాడుల్ని అడ్డుకుని ప్రజలకు అండగా నిలవాలని కోరారు.
Vijay Sai Reddy
Pawan Kalyan
Jana Sena
YSRCP
Telugudesam

More Telugu News