జమ్మలమడుగులో 144 సెక్షన్ విధించిన పోలీసులు.. టీడీపీ, వైసీపీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు!
- నేడు నామినేషన్లకు చివరి రోజు
- వైసీపీ అభ్యర్థికి ఉదయం 11 నుంచి 12 గంటల వరకూ సమయం
- ఈలోగా నామినేషన్ దాఖలు చేయాలని సూచన
కడప జిల్లాలోని జమ్మలమడుగులో ఈరోజు బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలను నిషేధించామని ప్రకటించారు. అలాగే ఆర్డీవో కార్యాలయం పరిధిలో 100 మీటర్ల మేర నిషేధాజ్ఞలు విధించామని పేర్కొన్నారు. కాగా, ఈ సందర్భంగా నామినేషన్ దాఖలు చేసేందుకు వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డికి ఈరోజు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకూ పోలీసులు సమయాన్ని కేటాయించారు. టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డికి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకూ సమయం ఇచ్చారు.