allu arjun: బన్నీ కోసం విలాసవంతమైన క్యారవాన్ .. ఖరీదు 7 కోట్లు

షార్ట్స్‌లో చూడండి
తెలుగులోని స్టార్ హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. తనకి సంబంధించిన ప్రతి విషయం కొత్తగా వుండాలని ఆయన భావిస్తుంటాడు .. తన టేస్టు గురించి అంతా మాట్లాడుకునేలా చేస్తుంటాడు. అలా ఇప్పుడు అందరూ ఆయన కొత్త క్యారవాన్ గురించి మాట్లాడుకుంటున్నారు.

టాలీవుడ్లో ఇంతవరకూ ఖరీదైన క్యారవాన్ మహేశ్ బాబుకి మాత్రమే వుంది. కొంతకాలం క్రితమే 3 నుంచి 4 కోట్లు ఖర్చు పెట్టి ఆయన ఈ క్యారవాన్ కొనుగోలు చేశాడు. అంతకన్నా సౌకర్యవంతమైన .. విలాసవంతమైన క్యారవాన్ ను అల్లు అర్జున్ కొనుగోలు చేశాడనేది తాజా సమాచారం. ప్రస్తుతం ముంబైలో తయారుచేయబడుతోన్న ఈ క్యారవాన్ త్వరలోనే హైదరాబాద్ కి రానున్నట్టు సమాచారం. ఈ క్యారవాన్ కోసం అల్లు అర్జున్ 7 కోట్లు ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక వచ్చేనెలలో త్రివిక్రమ్ తో కలిసి అల్లు అర్జున్ సెట్స్ పైకి వెళ్లనున్న విషయం తెలిసిందే.
Go Back to Shorts
allu arjun

More Telugu News