Chandrababu: 31న విశాఖలో టీడీపీ భారీ బహిరంగ సభ.. తరలిరానున్న జాతీయ నేతలు

  • పశ్చిమబెంగాల్, ఢిల్లీ ముఖ్యమంత్రులకు టీడీపీ ఆహ్వానం
  • విశాఖలో రసవత్తరంగా మారిన చతుర్ముఖ పోరు
  • బరిలో శ్రీభరత్, లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, సత్యనారాయణ
ఈ నెల 31న విశాఖపట్టణంలో టీడీపీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు జాతీయ నేతలు తరలిరానున్నారు. ఈ ఎన్నికల్లో అందరి దృష్టి విశాఖ నియోజకవర్గంపైనే ఉంది. ఇక్కడి నుంచి దివంగత మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనవడు, బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ పోటీలో నిలవగా, వైసీపీ నుంచి సత్యనారాయణ, జనసేన నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, బీజేపీ నుంచి పురందేశ్వరి తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ చతుర్ముఖ పోరు రసవత్తరంగా మారనుంది.

దీంతో ఇక్కడ విజయం సాధించడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోనే అతిపెద్ద నగరమైన విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. ఈ నెల 31న నగరంలో నిర్వహించనున్న సభకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా మరికొందరు జాతీయ నాయకులను టీడీపీ ఆహ్వానించినట్టు సమాచారం.
Chandrababu
Telugudesam
Visakhapatnam District
mamata banerjee
Arvind Kejriwal

More Telugu News