TRS: హరీశ్ రావుకు మరో షాక్.. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో దక్కని చోటు

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ కేబినెట్ లో టీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావుకు స్థానం దక్కని సంగతి తెలిసిందే. ఇప్పుడు పార్టీ అధిష్ఠానం ఆయనకు మరో షాక్ ఇచ్చింది. పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కూడా ఆయనకు స్థానం దక్కలేదు. ఎన్నికల సంఘానికి 20 స్టార్ క్యాంపెయినర్ల జాబితాను టీఆర్ఎస్ పంపింది. వీరిలో ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేబినెట్ లోని 11 మంది మంత్రులు, పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, ఐదుగురు పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డి, బండా ప్రకాశ్, జే సంతోష్ కుమార్, టీ రవీందర్ రావు, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డిల పేర్లు ఉన్నాయి. ఈ జాబితాలో హరీశ్ రావుకు స్థానం దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. 
Go Back to Shorts
TRS
star campaingners
harish rao

More Telugu News