lakshmis ntr: 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా మాకు చూపించండని ఆదేశించిన ఈసీ.. నేడు కలవనున్న నిర్మాత

షార్ట్స్‌లో చూడండి
ఎన్నికల సమయంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించడంతో.. టీడీపీ శ్రేణులు కలవరపాటుకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఏప్రిల్ 11న పోలింగ్ ముగిసేంత వరకు ఈ చిత్రం విడుదలను ఆపేయాలని శ్రీకాళహస్తికి చెందిన మోహన్ రావు అనే వ్యక్తి ఈసీకి ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో, 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని తమకు చూపించాలంటూ నిర్మాత రాకేష్ రెడ్డిని ఎన్నికల కమిషన్ ఆదేశించింది.ఈ నేపథ్యంలో, ఈరోజు ఎన్నికల సంఘం ముందుకు రాకేష్ రెడ్డి హాజరుకానున్నారు.
Go Back to Shorts
lakshmis ntr
varma
ec
release

More Telugu News