Pawan Kalyan: భీమవరంలో గెలుపుపై బెట్టింగులు.. పవన్‌దే విజయమంటూ రూ. 15 లక్షల పందెం?

  • ఎన్నికల వేళ జోరందుకున్న బెట్టింగులు
  • పవన్ గెలుపుపై లక్షల్లో పందేలు
  • రంగంలోకి పోలీసులు
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పందెం రాయుళ్లు జోరు పెంచారు. బెట్టింగులతో సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. ఇక ఈ ఎన్నికలతో నేరుగా బరిలోకి దిగుతున్న పవన్‌పైనే బెట్టింగ్ వీరుల దృష్టి పడింది. భీమవరం నుంచి బరిలోకి దిగుతున్న పవన్ గెలుపోటములపై జోరుగా పందేలు కాస్తున్నారు.

భీమవరానికి చెందిన ఓ బంగారు వర్తకుడు పవన్ విజయం సాధిస్తారని ఐదు లక్షల రూపాయల పందెం కాసినట్టు తెలుస్తోంది. భీమవరం రెండో పట్టణానికి చెందిన చేపల చెరువుల యజమాని ఒకరు భీమవరంలో జనసేన విజయం పక్కా అంటూ రూ. 15 లక్షలు పందెం కాసినట్టు భోగట్టా. మరో ఆక్వా వ్యాపారి అయితే పవన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమంటూ పది లక్షల రూపాయలు పందెం కాసినట్టు తెలుస్తోంది. విషయం బయటకు పొక్కడంతో రంగంలోకి దిగిన పోలీసులు బెట్టింగ్ రాయుళ్లపై  దృష్టిసారించినట్టు తెలుస్తోంది.
Pawan Kalyan
Bhimavaram
bettitng
Andhra Pradesh
Jana sena

More Telugu News