Andhra Pradesh: ఆ లోటస్ పాండ్ లోనే ఉండండి, తెలంగాణలోనే పోటీ చేయండి: జగన్ పై చంద్రబాబు సెటైర్లు

  • స్వలాభాల కోసం టీఆర్ఎస్ తో వైఎస్ జగన్ కలిశారు
  • ఇప్పటివరకూ తెలంగాణలోనే జగన్ ఉన్నారు
  • ఏపీ గడ్డపై ఓటు అడిగే హక్కు జగన్ కు లేదు
తనపై ఉన్న కేసుల మాఫీ కోసం, స్వలాభాల కోసం టీఆర్ఎస్ తో వైఎస్ జగన్ కలిశారని సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటివరకూ తెలంగాణలోనే ఉన్న జగన్, తన లోటస్ పాండ్ లోనే ఉండాలని, ఆ రాష్ట్రంలోనే మంత్రి కావడమో లేక ఎంపీగా పోటీ చేయడమో చేయాలని సెటైర్లు విసిరారు. ఏపీ గడ్డపై ఓటు అడిగే హక్కు జగన్ కు లేదని అన్నారు. రేపు జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డిని, ఎంపీగా పనబాక లక్ష్మిని గెలిపించాలని కోరారు.  
Andhra Pradesh
Telangana
Chandrababu
jagan

More Telugu News