Guntur District: ఇంకొక్క ఐదేళ్లు మేము పాలిస్తే ఏపీ ఎక్కడో ఉంటుంది: నారా లోకేశ్

  • ఏపీని ఐదేళ్లలో అభివృద్ధి చేశాం
  • ఇంకో ఐదేళ్లు పాలిస్తే మరింత అభివృద్ధి చేస్తాం
  • మంచి మెజార్టీతో నన్ను గెలిపించండి
ఏపీని ఐదేళ్లలో అభివృద్ధి చేశామని, ఇంకో ఐదేళ్లు పాలించే అవకాశం తమ పార్టీకి కల్పిస్తే అభివృద్ధిపరంగా రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళతామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, మంచి మెజార్టీతో తనను గెలిపిస్తే, యావత్ భారతదేశం మంగళగిరి వైపు చూసేలా చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఎలాంటి సమస్య వున్నా తక్షణమే పరిష్కరిస్తానని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదని ప్రజలకు చెప్పారు.
Guntur District
Mangalagiri
Telugudesam
Nara Lokesh

More Telugu News