Chandrababu: 'కేసీఆర్... రా!... పలమనేరులో నా పౌరుషాన్ని చూడు..' అంటూ నిప్పులు చెరిగిన చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా పలమనేరులో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇవాళ మనపోరాటం వైఎస్సార్ కాంగ్రెస్ తో కాదు, టీఆర్ఎస్ పార్టీతోనని ఉద్ఘాటించారు.

"వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే అది కేసీఆర్ ని గెలిపించినట్టే. కేసీఆర్ మనమీద పెత్తనం చేయాలనుకుంటున్నాడు. కేసీఆర్ మనకు అన్యాయం చేశాడు. 60 ఏళ్ల మన కష్టాన్ని దోచుకుని మనల్ని అవమానంతో పంపించారు. కేసీఆర్.. రా!... వచ్చి పలమనేరులో నా పౌరుషాన్ని చూడు అంటూ ప్రతిఒక్కరూ గర్జించాలి, ఖబడ్దార్ కేసీఆర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అడ్డంపెట్టుకుని మా జోలికి వస్తే వదిలిపెట్టం. వైఎస్సార్ కాంగ్రెస్ దివాలాకోరు పార్టీ. ఆ పార్టీ నేతలు మోదీకి ఊడిగం చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే. మైనారిటీలకు రక్షణగా నేనుంటా" అంటూ ప్రసంగించారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
Jagan
KCR

More Telugu News