Narendra Modi: ఈ నెల 29న ఏపీకి వస్తున్న ప్రధాని మోదీ

  • షెడ్యూలు ఖరారు
  • కర్నూలు, రాజమండ్రిలో భారీ సభలు
  • 'మళ్లీ మోదీ' నినాదంతో బీజేపీ ప్రచారం
గత ఎన్నికల్లో టీడీపీతో జట్టుకట్టిన బీజేపీ మారిన పరిస్థితుల నేపథ్యంలో ఏపీలో ఈసారి ఒంటరిగా పోటీచేస్తోంది. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ మ్యాజిక్ చేస్తారని రాష్ట్ర బీజేపీ వర్గాలు భారీగా ఆశలు పెట్టుకున్నాయి. ఇప్పటికే 'మళ్లీ మోదీ' నినాదంతో కరపత్రాలు ముద్రించిన కాషాయ శ్రేణులు ప్రచారం ముమ్మరం చేశాయి. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మోదీ ఏపీ వస్తుండడం స్థానిక శ్రేణుల్లో ఉత్సాహం కలిగిస్తోంది. మోదీ ఈనెల 29న రాష్ట్రానికి రానున్నారు. అదే రోజున కర్నూలులో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత ఏప్రిల్ 1న రాజమండ్రిలో జరిగే మరో సభకు హాజరవుతారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
Narendra Modi
BJP
Andhra Pradesh

More Telugu News