India: పాక్ లో హిందూ బాలికల కిడ్నాప్ పై ఇమ్రాన్ ఖాన్ సీరియస్

షార్ట్స్‌లో చూడండి
మనదేశంలో ముస్లింలు ఎలా మైనారిటీలుగా ఉన్నారో పాకిస్థాన్ లో హిందువులు మైనారిటీ వర్గంగా ఉన్నారు. అక్కడ హిందువుల మీద తరచుగా దాడులు, బలవంతపు మతమార్పిడి ఘటనలు జరుగుతుంటాయి. తాజాగా, హోలీ సందర్భంగా ఇద్దరు అక్కాచెల్లెళ్లను కిడ్నాప్ చేసి మతమార్పిడి జరిపించి ఆపై వివాహం చేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది.

ప్రధానమంతి ఇమ్రాన్ ఖాన్ సైతం ఈ ఘటనపై తీవ్రస్థాయిలో దృష్టిపెట్టారు. సింధ్ ప్రావిన్స్ లోని గోట్కీ జిల్లాలో నివసించే రీనా (15), రవీనా (13) అక్కాచెల్లెళ్లు. కొందరు వ్యక్తులు హోలీ రోజున వారి ఇంటి నుంచే కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అయితే, ఆ తర్వాత వారికి వివాహలు జరిపిస్తున్న వీడియో వెలుగులోకి రావడంతో పాక్ లో ఉన్న హిందూ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. బలవంతంగా మతమార్పిడి చేసి పెళ్లిళ్లు చేశారంటూ ఆరోపణలు వినిపించాయి.

కానీ, ఆ వీడియోలో రీనా, రవీనా మాట్లాడుతూ, తమను ఎవరూ బలవంతం చేయలేదని, తమ ఇష్టపూర్వకంగానే ఇస్లాం మతం స్వీకరించి వివాహలు చేసుకున్నామంటూ చెప్పడం కనిపించింది. దీనిపై హిందువులు భగ్గుమన్నారు. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయడంతో విషయం ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వరకు వెళ్లింది. ఆయన ఈ ఘటనపై వెంటనే విచారణకు ఆదేశించాలని సంబంధిత మంత్రిత్వశాఖను ఆదేశించారు. దీనిపై భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కూడా స్పందించారు. పూర్తి వివరాలు అందించాలంటూ పాక్ లోని భారత హైకమిషనర్ ను కోరారు.
Go Back to Shorts
India
Pakistan

More Telugu News