Andhra Pradesh: ఏ నాయకుడైనా అతి తెలివి ప్రదర్శిస్తే దండం పెట్టడం మినహా మరేం చేయలేను: పార్టీ నేతలతో చంద్రబాబు

  • విభేదాలు లేకుండా పని చేయాలి
  • పార్టీని మోసం చేద్దామనే ఆలోచనలు చేయొద్దు
  • వైసీపీ ప్రలోభాలను ఆధారాలతో సహా బయటపెట్టాలి
విభేదాలు లేకుండా పని చేయాలని తమ పార్టీ నేతలకు సీఎం చంద్రబాబునాయుడు సూచించినట్టు సమాచారం. పార్టీ నేతలతో ఈరోజు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ నాయకుడైనా అతి తెలివి ప్రదర్శిస్తే దండం పెట్టడం మినహా మరేం చేయలేనని, నాయకులు తమను తాము మోసం చేసుకుని పార్టీని మోసం చేద్దామనే ఆలోచనలు చేయొద్దని సూచించినట్టు సమాచారం. టీడీపీ బూత్ కమిటీ కన్వీనర్లు ప్రలోభాలకు గురిచేస్తున్నారని, వైసీపీకి చెందిన పెద్ద నేతలే ప్రలోభాలకు గురిచేస్తున్నారని, వైసీపీ ప్రలోభాలను ఆధారాలతో సహా బయటపెట్టాలని పార్టీ నేతలకు చంద్రబాబు చెప్పినట్టు సమాచారం.
Andhra Pradesh
Chandrababu
cm
YSRCP

More Telugu News