Andhra Pradesh: ఇక్కడ మీకు ఒక్క ఓటు కూడా లేదు.. ఇక్కడి రాజకీయాలు మీకెందుకు కేసీఆర్?: నారా లోకేశ్

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ లో టీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఓటు కూడా లేదని ఏపీ ఐటీ శాఖ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ తెలిపారు. అలాంటప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇక్కడి రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. ఏపీ ఆస్తులపై గుత్తాధిపత్యం కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, అందుకు వైసీపీ అధినేత జగన్ సహకరిస్తున్నారని ఆరోపించారు.

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో లోకేశ్ ఈరోజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని లోకేశ్ జోస్యం చెప్పారు.
Go Back to Shorts
Andhra Pradesh
Jagan
YSRCP
Telugudesam
Nara Lokesh
Guntur District
Telangana
KCR
TRS

More Telugu News