Sukumar: దర్శకుడు సుకుమార్ ఇంటికెళ్లి మద్దతు కోరిన టీడీపీ, జనసేన అభ్యర్థులు!

  • టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల జాబితాలో సుకుమార్
  • తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సుకుమార్
  • విడివిడిగా కలిసిన సూర్యారావు, ప్రసాదరావు
'రంగస్థలం' చిత్రం తరువాత టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయిన సుకుమార్ మద్దతు కోసం తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆయన స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా మలికిపురం అన్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు సమయం దగ్గర పడ్డ నేపథ్యంలో, మలికిపురంలో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న గొల్లపల్లి సూర్యారావు, జనసేన తరఫున పోటీ చేస్తున్న రాపాక ప్రసాదరావులు విడివిడిగా సుకుమార్ ఇంటికి వెళ్లి, తమకు మద్దతివ్వాలని కోరారు. ఇప్పటికే రాష్ట్రంలో నేతల ప్రచారం జోరందుకుంది. ఉదయం నుంచి రాత్రి వరకూ నాయకులు ప్రజలను, ప్రముఖులనూ కలుస్తూ ప్రచారం నిర్వహించుకుంటూ దూసుకెళుతున్నారు.
Sukumar
Malikipuram
Telugudesam
Jana Sena

More Telugu News