Andhra Pradesh: రూ.84 లక్షల ఆస్తులు ఒక్కసారిగా 340 కోట్లకు ఎలా పెరిగాయో జగన్ చెప్పాలి!: జూపూడి ప్రభాకర్ రావు

షార్ట్స్‌లో చూడండి
2004 ఎన్నికల సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆస్తులు రూ.84 లక్షలు ఉన్నట్లు చూపారని, అదే 2019 ఎన్నికల నాటికి ఆస్తులు రూ.340 కోట్లు ఉన్నట్లు జగన్ చూపించారని టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. ఈ పదేళ్ల కాలంలో ఆస్తులు అమాంతం ఎలా పెరిగాయో జగన్ చెప్పాలని జూపూడి డిమాండ్ చేశారు. అమరావతిలో టీడీపీ నేత శేషసాయి బాబుతో కలిసి జూపూడి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని దోచుకున్న జగన్ ప్రజాసేవ ముసుగులో తిరుగుతున్నారని జూపూడి విమర్శించారు. సీబీఐ, ఈడీ పెట్టిన కేసులకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యాపారం ముసుగులో సంపాదించిన ఆస్తులపై జగన్ స్పష్టత ఇవ్వాలన్నారు. కేసుల మాఫీ కోసమే జగన్ మోదీ, కేసీఆర్ ల సాయం తీసుకున్నారని దుయ్యబట్టారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telugudesam
jupudi

More Telugu News