Andhra Pradesh: అమరావతి నిర్మాణం విషయంలో టీడీపీ పోరాడుతోంది!: ‘మా’ అధ్యక్షుడు నరేశ్

  • ఏపీలో గెలిచే పార్టీని బట్టి సంక్షేమం ఉంటుంది
  • టీడీపీ ప్రభుత్వ పోరాటాన్ని సమర్థిస్తున్నా
  • పవన్ కల్యాణ్ ను వ్యక్తిగా అభిమానిస్తా
మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) అధ్యక్షుడు నరేశ్ ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో అమరావతి నిర్మాణం కోసం టీడీపీ పోరాడుతోందని నరేశ్ తెలిపారు. ఏపీలో రాబోయే ఎన్నికల్లో గెలిచే పార్టీని బట్టి, ప్రభుత్వాన్ని బట్టి సంక్షేమ పథకాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నరేశ్ మాట్లాడారు.

అమరావతి నిర్మాణం విషయంలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కృషి, పోరాటాన్ని ఎవరైనా సమర్థిస్తారని వ్యాఖ్యానించారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను తాను వ్యక్తిగా అభిమానిస్తాననీ, ఆయన గెలుపోటములతో తనకు సంబంధం లేదని నరేశ్ తేల్చిచెప్పారు.
Andhra Pradesh
amaravati
Telugudesam
maa
naresh
comments

More Telugu News