Pawan Kalyan: యువతను మేల్కొలిపే లక్షణాలు పవన్‌లో పుష్కలం: మా అధ్యక్షుడు నరేష్‌

  • వ్యక్తిగా పవన్‌ పనితీరును అభినందిస్తున్నా
  • ఆయన గెలుపు ఓటములతో సంబంధం లేదు
  • నాగబాబుకు నా సంపూర్ణ మద్దతు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ (మా) నూతన అధ్యక్షుడు, హాస్య నటుడు నరేష్‌ తాజాగా పవన్‌ కల్యాణ్‌పై  పొగడ్తల వర్షం కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ యువతను మేల్కొలిపే లక్షణాలు పవన్‌కల్యాణ్‌లో పుష్కలమని చెప్పారు. సమాజంలో మార్పు తేవాలని పవన్‌ ఓ యోగిలా తిరుగుతున్నారని అన్నారు. పవన్‌ గెలుపు ఓటములతో తనకు సంబంధం లేదని, వ్యక్తిగా వవన్‌ సేవలను అభినందిస్తున్నానని చెప్పారు. మా ఎన్నికల్లో సినీ నటుడు నాగబాబు తనకు మద్దతు పలికారని, నరసాపురం ఎంపీగా పోటీ చేస్తున్న ఆయనకు తన మద్దతు తప్పనిసరిగా ఉంటుందని నరేష్‌ చెప్పారు.
Pawan Kalyan
MAA
naresh

More Telugu News