Virat Kohli: 6990242410... ఫోన్ నంబర్ కాదు... ఏంటో తెలుసుకుని అవాక్కవుతున్న కోహ్లీ ఫ్యాన్స్!

  • నిన్న చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్
  • పార్థివ్ మినహా రెండంకెల స్కోరు సాధించలేకపోయిన ఆటగాళ్లు
  • అవమానకరమంటున్న అభిమానులు
6990242410... ఏదో మొబైల్ నంబర్ అనుకుంటున్నారా? కాదండీ... నిన్న జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ ఆటగాళ్లలో పది మంది చేసిన స్కోర్లు. ఒక్క పార్థివ్ పటేల్ మినహా మిగతా పది మంది చేసిన స్కోర్లివి. ఈ మ్యాచ్ లో కోహ్లీ 6, మొయిన్ అలీ 9, డివిలియర్స్ 9, హెట్ మెయర్ 0, శివమ్ దూబే 2, గ్రాండ్ హోమ్ 4, నవదీప్ సైనీ 2, చాహాల్ 4, ఉమేశ్ యాదవ్ 1, సిరాజ్ 0 పరుగులు చేశారు. వీరు కొట్టిన పరుగులను ఓ చోట చేరిస్తే అది ఓ మొబైల్ నంబర్ అయిపోయింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ సేన ఘోరంగా ఓడిపోవడాన్ని కోహ్లీ, ఆర్సీబీ అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. చెన్నైపై కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయారని, ఇది అవమానకరమని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
Virat Kohli
RCB
Chennai Superking
IPL 2019

More Telugu News