Pawan Kalyan: హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ పై కేసు నమోదు!

  • తెలంగాణను పాక్ తో పోల్చిన పవన్
  • భీమవరంలో ఎన్నికల ప్రచారం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన అడ్వొకేట్ జేఏసీ
తెలంగాణను పాకిస్థాన్ తో పోల్చినందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. రాష్ట్ర అడ్వొకేట్ జేఏసీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు. రెండు రోజుల క్రితం భీమవరంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం పవన్ కల్యాణ్ పర్యటించిన వేళ, పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం పాకిస్థాన్ లా మారిందని నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో లబ్ది కోసం ఆయన తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ పై నోరు పారేసుకుంటున్నారని అడ్వొకేట్ జేఏసీ ఫిర్యాదు చేసింది.
Pawan Kalyan
Telangana
Pakistan
plice
Hyderabad
Case

More Telugu News