Prakash Raj: ప్రకాశ్ రాజ్ కున్న ఆస్తుల వివరాలు!

  • బెంగళూరు సెంట్రల్ నుంచి పోటీ పడుతున్న ప్రకాశ్ రాజ్
  • రూ. 31 కోట్ల విలువైన ఆస్తులున్నాయి
  • అఫిడవిట్ లో వెల్లడించిన ప్రకాశ్ రాజ్
ఈ సార్వత్రిక ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న నటుడు ప్రకాశ్ రాజ్ ఆస్తుల విలువ రూ. 31 కోట్లు. తన నామినేషన్ తో పాటు ప్రకటించిన అఫిడవిట్ లో ఆస్తి వివరాలను ఆయన వెల్లడించారు. తన వద్ద మొత్తం రూ. 26.59 కోట్ల విలువైన స్థిరాస్థులు, రూ. 4.93 కోట్ల చరాస్తులు ఉన్నాయని ప్రకాశ్ రాజ్ తెలిపారు.

2018లో సినిమాల్లో నటించడం ద్వారా రూ. 2.40 కోట్ల ఆదాయాన్ని పొందానని, వివిధ బ్యాంకుల్లోని ఖాతాల్లో రూ. 25 వేల నగదు, రూ. 2.94 కోట్ల పెట్టుబడులు, రూ. 1.88 కోట్ల విలువైన వాహనాలు ఉన్నాయని అన్నారు. ఇక ఆయన భార్య రష్మీ వర్మ పేరిట రూ. 20.46 లక్షల చరాస్థి, రూ. 35 లక్షల విలువైన స్థిరాస్తులతో పాటు రూ. 18 లక్షల విలువైన బంగారం తదితర విలువైన ఆభరణాలున్నాయని వెల్లడించారు. శాంతికి భంగం కలిగించారన్న ఆరోపణపై చిక్ మగుళూరులో తనపై ఓ కేసు నమోదైందని ఆయన పేర్కొన్నారు. 
Prakash Raj
Bengalore Central
Assets
Elections

More Telugu News