KA Paul: 'కేఏ పాల్ వర్ధిల్లాలి' అంటున్న తెలుగుదేశం కార్యకర్తలు... వైరల్ వీడియో!

  • ప్రజాశాంతి పార్టీ పెట్టిన కేఏ పాల్
  • హెలికాప్టర్ గుర్తుపై పోటీ
  • ప్రచారంలో కలిసిన టీడీపీ కార్యకర్తలతో డ్యాన్స్
ప్రజాశాంతి పేరిట పార్టీని పెట్టి, హెలికాప్టర్ గుర్తుపై అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కేఏ పాల్, ఎంత జోవియల్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. తాజాగా, ఆయన ఎన్నికల ప్రచారానికి వెళుతూ, మార్గమధ్యంలో ఓ చోట తన కాన్వాయ్ ని ఆపిన వేళ, ఎదురు వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలు, కేఏ పాల్ కు స్వాగతం పలికి, ఆయన వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు.

వారి ఉత్సాహాన్ని చూసిన కేఏ పాల్, సైతం మరింత ఉత్సాహంతో వారితో కలిసి డ్యాన్సులేశారు. ఈ సందర్భంగా తనతో ఉన్న ఓ టీవీ చానల్ ప్రతినిధితో మాట్లాడుతూ, తాను ప్రజలందరికీ తెలుసునని, తనకు ఓటేయాలని ఎవరినీ కోరడం లేదని, వారే తన వద్దకు వచ్చి ఓటేస్తామని చెబుతున్నారని అన్నారు. కేఏ పాల్ ప్రచార వీడియోను మీరూ చూడండి.
KA Paul
Prajashanti
Helecopter
Viral Videos

More Telugu News