Uma Bharati: బీజేపీ వైస్ ప్రెసిడెంట్ గా ఉమాభారతి నియామకం

  • ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేసిన ఉమా భారతి
  • మే తరువాత ఏడాదిన్నర పాటు తీర్థయాత్రలకు వెళతానని వెల్లడి
  • ఆమెను పార్టీ ఉపాధ్యక్షురాలిగా నియమించిన బీజేపీ
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ప్రకటించిన కేంద్ర మంత్రి ఉమా భారతిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష పదవి వరించింది. ఆమెను పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా నియమిస్తున్నట్టు ప్రకటన వెలువడింది. లోక్‌ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనంటూ ఆమె ప్రకటించిన రోజుల వ్యవధిలో ఈ బాధ్యతలు అప్పగించడం గమనార్హం.

ప్రస్తుతం యూపీలోని ఝాన్సీ లోక్‌ సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్న ఉమా భారతి, మే తరువాత ఏడాదిన్నరపాటు తీర్థయాత్రలకు వెళ్లనున్నానని ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. వయసు రీత్యా తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించడం లేదని, తన స్థానంలో యువతకు ప్రాతినిధ్యం కల్పించాలని పార్టీ నాయకత్వానికి సూచించారు. దీంతో ఆమె సేవలు పార్టీకి కావాలంటూ, కరుడుగట్టిన హిందుత్వవాదిగా పేరున్న ఉమాకు ఉపాధ్యక్ష బాధ్యతలు బీజేపీ అప్పగించింది.
Uma Bharati
BJP
Vice President
Elections

More Telugu News