Cricket: రాయల్ చాలెంజర్స్ ఏం మారలేదు... ఐపీఎల్ కొత్త సీజన్ ఓటమితో ఆరంభం

  • ప్రారంభ మ్యాచ్ లో చెన్నై విక్టరీ
  • 7 వికెట్ల తేడాతో బెంగళూరు ఓటమి
  • రాణించిన స్పిన్నర్లు
ఐపీఎల్-12వ సీజన్ పూర్తిగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్ తో ఆరంభమైంది. చెన్నై వేదికగా జరిగిన ఈ పోరులో ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 7 వికెట్లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ఘనవిజయం సాధించింది. 71 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై జట్టు 17.4 ఓవర్లలో 3 వికెట్లకు 71 పరుగులు చేసి విజయభేరి మోగించింది. గత సీజన్లలో పరమ చెత్త ఆటతీరుతో విమర్శల పాలైన కోహ్లీ జట్టు ఈసారి అందుకు పరాకాష్ట అనదగ్గ రీతిలో దారుణ ప్రదర్శన కనబర్చింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 17.1 ఓవర్లలో 70 పరుగులకే చాపచుట్టేసింది. హర్భజన్, తాహిర్ చెరో 3 వికెట్లతో ప్రత్యర్థి భరతం పట్టారు. అనంతరం, లక్ష్యఛేదనలో చెన్నై ధాటిగా ఆడలేకపోయినా నిదానంగానే విజయతీరాలకు చేరింది. రాయుడు 28, రైనా 19 పరుగులు చేశారు. ఓపెనర్ వాట్సన్ డకౌట్ అయ్యాడు.
Cricket

More Telugu News