Andhra Pradesh: ఇలాంటి వ్యక్తికి ‘పద్మశ్రీ’ ఇచ్చారా?: మోహన్ బాబుపై కుటుంబరావు విమర్శ

  • ‘పద్మశీ’ వచ్చిన మహానటులు చాలా మంది ఉన్నారు
  • కానీ, మోహన్ బాబు లాంటి వారు లేరు
  • మోహన్ బాబుకు డాక్టరేట్ కూడా ఉందట: కుటుంబరావు సెటైర్లు
‘పద్మశీ’ వచ్చిన మహానటులు చాలా మంది ఉన్నారు కానీ, మోహన్ బాబు లాంటి మహానటుడు, ఈవిధంగా నటించే మనిషి మరొకరు లేరని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు దుయ్యబట్టారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇటువంటి వ్యక్తికి ‘పద్మశ్రీ’ ఇవ్వడం తనకు చాలా బాధగా ఉందని వ్యాఖ్యానించారు. ‘నేను పెద్దగా సినిమాలు చూడను. మోహన్ బాబు ఎంత పెద్ద ఫిల్మ్ యాక్టరో నాకైతే తెలియదు. చాలా పెద్ద ఫిల్మ్ యాక్టరేమో, అందుకే, ఆ అవార్డు ఇచ్చారేమో. మోహన్ బాబుకు డాక్టరేట్ కూడా ఉందట! నేను అయితే డిగ్రీలే చేశా. నాకైతే డాక్టరేట్ లేదు’ అని ఓ రేంజ్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Andhra Pradesh
Kutumbarao
Mohan Babu
Padma sri
Tollywood
Film
Actor
Doctorate

More Telugu News