Chittoor District: మంచు ఫ్యామిలీ కన్నా పచ్చి అబద్ధాలు చెప్పే కుటుంబం మరోటి ఉందా?: కుటుంబరావు

  • ఇదంతా, కేవలం రాజకీయం కోసమే
  • మంచు విష్ణు  ఎవరిని పెళ్లి చేసుకున్నాడు?
  • జగన్మోహన్ రెడ్డి  కజిన్ ని కాదా?
ప్రముఖ సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థల అధినేత మోహన్ బాబుపై ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఈ రోజు తీవ్రంగా మండిపడ్డారు. 'నారా వారి ఫ్యామిలీ తరఫున కుటుంబరావు వకాల్తా తీసుకున్నారు' అంటూ మోహన్ బాబు తనపై ఆరోపణలు చేయడం తగదని కుటుంబరావు అన్నారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ,  ప్రభుత్వంపై అవాస్తవాలు మాట్లాడుతుంటే, స్వార్థం కోసం పిల్లల జీవితాలతో ఆడుకుంటుంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు.  

మంచు ఫ్యామిలీ కన్నా పచ్చి అబద్ధాలు చెప్పే కుటుంబం మరోటి ఉందా? ఇదంతా, కేవలం రాజకీయం కోసమే. ‘విష్ణు గారు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారి కజిన్ ని కాదా? జగన్మోహన్ రెడ్డి గారికి వకాల్తా నువ్వు పట్టుకుంటున్నావు. వారం నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే క్రిమినల్ ని వేసుకుని ఊరంతా తిరుగుతున్నావు. నిజంగా, నువ్వు ఓ ఎడ్యుకేషనిస్టు అయితే ఓ క్రిమినల్ కోసం ఓట్లు అడుగుతావా? వైసీపీకే ఎన్నికల ప్రచారం చేస్తానంటే చెయ్యండి. కాదనట్లేదు’ అని మంచు కుటుంబంపై మండిపడ్డారు.  

 తమ విద్యా సంస్థల ప్రాంగణం బయట ఉన్న హోటల్స్, స్నాక్స్, కూల్ డ్రింక్స్ అమ్మే షాపుల నుంచి శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల యాజమాన్యం గుడ్ విల్ తీసుకుంటున్నారని కుటుంబరావు ఆరోపించారు. తమ విద్యా సంస్థల వల్లే ఈ హోటల్స్, స్నాక్స్, కూల్ డ్రింక్స్ కు వ్యాపారం జరుగుతోంది కనుక తమకు గుడ్ విల్ ఇవ్వాలని వారు అన్నట్టు ఆరోపణలు వచ్చినట్టు చెప్పారు. ముందు, మీ క్రెడిబులిటీ ఏంటో నిరూపించుకోండి? అని హితవు పలికారు. తమపై బురదజల్లాలని చూస్తే కుదరదని, మంచు కుటుంబం అంటే ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలని కుటుంబరావు సూచించారు.
Chittoor District
Tirupathi
Amaravathi
Mohanbabu
Kutumba Rao
YSRCP
Jagan
Manchu Vishnu

More Telugu News