Andhra Pradesh: కడప జిల్లాలో పోలీసులు తనిఖీలు.. రూ.49 లక్షల పట్టివేత!

  • ప్రకాశం జిల్లాలో మరో రూ.3.10 లక్షల స్వాధీనం
  • ఓ పార్టీ అభ్యర్థి తరఫున పంచుతున్న రాఘరావు అనే వ్యక్తి
  • కడపలో బైక్ పై తీసుకెళుతుండగా పట్టుకున్న పోలీసులు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా కడప జిల్లా వన్ టౌన్ కూడలిలో పోలీసులు ఈరోజు రూ.49 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా బైక్ పై తరలిస్తున్న ఈ మొత్తాన్ని అధికారులు స్టేషన్ కు తరలించారు.

అలాగే ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామన్న పేటలో పోలీసులు రూ.3.10 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఓ రాజకీయ పార్టీ అభ్యర్థి తరఫున రాఘవరావు అనే వ్యక్తి ఈ నగదును పంచుతుండగా పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు.
Andhra Pradesh
Kadapa District
prakasam
49 lakh

More Telugu News