Andhra Pradesh: మెగాబ్రదర్ కొణిదెల నాగబాబు పేరుపై ఉన్న ఆస్తులివే!

  • నాగబాబు, ఆయన భార్య పేరుపై రూ.41 కోట్ల ఆస్తులు
  • ఇందులో రూ.36.7 కోట్ల చరాస్తులు, రూ.4.22 కోట్ల స్థిరాస్తులు
  • ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న నాగబాబు
మెగాబ్రదర్ కొణిదెల నాగబాబు జనసేన టికెట్ పై నరసాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగబాబు తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తనతో పాటు తన భార్య పేరిట రూ.41 కోట్ల ఆస్తులు ఉన్నట్లు నాగబాబు అఫిడవిట్ లో తెలిపారు. ఇందులో స్థిరాస్తులు రూ.4.22 కోట్లు ఉండగా, చరాస్తులు రూ.36.73 కోట్ల మేర ఉన్నాయని వెల్లడించారు. అలాగే ఇద్దరి పేరుపై రూ.2.70 కోట్ల అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు.
Andhra Pradesh
election
nagababu
asstes
nomination
affidavit

More Telugu News