congress: ఫిరాయింపులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయం

  • టీఆర్‌ఎస్‌ తీరుపై గుర్రు
  • ఈరోజు నరసింహన్‌ను కలవనున్న ఏఐసీసీ ప్రతినిధులు
  • సాయంత్రం భేటీ కావాలని నిర్ణయం
తెలంగాణలో తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఒక్కొక్కరే కారెక్కి వెళ్లిపోతుంటే దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌ అధిష్ఠానం అధికార టీఆర్‌ఎస్‌ తీరుపై మండిపడుతోంది. అధికారాన్ని ఆశగా చూపి ఫిరాయింపులను యథేచ్ఛగా ప్రోత్సహిస్తోందంటూ ఆ పార్టీ నాయకులు రగిలి పోతున్నారు. దీనిపై గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.

ఇందుకోసం ఢిల్లీ నుంచి కొందరు అధిష్ఠానం పెద్దలు వస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీరప్పమొయిలీ నాయకత్వంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇంచార్జ్ ఆర్‌.సి.కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులతో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలవాలని నిర్ణయించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విచ్చల విడి రాజకీయ ఫిరాయింపులపై ఫిర్యాదు చేస్తారు.
congress
TRS
governor

More Telugu News