ajith: అజిత్ .. విజయ్ అంటే అందుకే నాకు చాలా ఇష్టం: కాజల్

  • అజిత్ లో అంకితభావం ఎక్కువ 
  • విజయ్ కి నటనే ప్రపంచం
  •  ఇద్దరిలోను గర్వమనేదే లేదు
తెలుగు.. తమిళ భాషల్లో కాజల్ అగ్రకథానాయికగా తన స్థానాన్ని సుదీర్ఘకాలంగా నిలబెట్టుకుంటూ వస్తోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. తమిళంలో కమల్ సరసన 'భారతీయుడు 2' సినిమాలో నటిస్తోంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తమిళ స్టార్ హీరోలైన అజిత్ .. విజయ్ లను గురించి ప్రస్తావించింది. అజిత్ తో 'వివేకం' సినిమాలో నటించాను. ఆ సినిమా చేయడానికి ముందే ఆయన గొప్పతనం గురించి తెలుసుకున్నాను.

ఆ సినిమా షూటింగు సమయంలో ఆయన అంకితభావాన్ని చూశాను. ఆయన ఆ స్థాయికి ఎలా చేరుకున్నారనేది అర్థమైపోయింది. ఆయనలోని మానవత్వం నన్ను కదిలించి వేసింది. ఇక విజయ్ తో కలిసి 'తుపాకి' .. 'జిల్లా' .. 'మెర్సల్' సినిమాలు చేశాను. సెట్స్ లోకి అడుగుపెట్టిన తరువాత ఆయన ఆ సినిమాను గురించి తప్ప మరో విషయాన్ని గురించిన ఆలోచన చేయడు. ఆయన నటనలో సహజత్వం నాకు నచ్చుతుంది. ఇంతటి స్టార్ హీరోలైన ఈ ఇద్దరిలోను గర్వమనేది మచ్చుకు కూడా నాకు కనిపించలేదు" అని చెప్పుకొచ్చింది.
ajith
vijay
kajal

More Telugu News