Pawan Kalyan: మరో జాబితాను ప్రకటించిన జనసేన.. బాలకృష్ణపై ఆకుల ఉమేశ్, జగన్‌పై చంద్రశేఖర్ పోటీ

  • మరో 16 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
  • అనంతపురం జిల్లాలో ఐదు స్థానాలు
  • కృష్ణా, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, చిత్తూరులలో రెండు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
జనసేన నుంచి మరో జాబితా వచ్చేసింది. మరో 16 అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం రాత్రి అభ్యర్థులను ప్రకటించింది. కృష్ణా, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, చిత్తూరులలో రెండు అసెంబ్లీ స్థానాలు, అనంతపురంలో ఐదు, కడప జిల్లాలో ఓ స్థానానికి అభ్యర్థులను ప్రకటించింది. ఇటీవల పార్టీలో చేరిన ఎస్పీవై రెడ్డి అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డికి నంద్యాల టికెట్ కేటాయించింది. హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ఆకుల ఉమేశ్, పులివెందులలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై తుపాకుల చంద్రశేఖర్‌ను బరిలోకి దింపింది. పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తున్న రాప్తాడు నుంచి సాకె పవన్‌కుమార్‌ను పవన్ బరిలో నిలిపారు.  

జనసేన తాజా జాబితా ప్రకారం..

కృష్ణా జిల్లా
గుడివాడ-వీఎన్‌వీ రఘునందన్‌రావు
జగ్గయ్యపేట-ధరణికోట వెంకటరమణ

గుంటూరు జిల్లా
పొన్నూరు - బోని పార్వతీనాయుడు
గురజాల-చింతలపూడి శ్రీనివాస్

కర్నూలు జిల్లా
నంద్యాల-సజ్జల శ్రీధర్ రెడ్డి
మంత్రాలయం-బోయ లక్ష్మణ్

అనంతపురం జిల్లా
రాయదుర్గం-కె.మంజునాథ్ గౌడ్
తాడిపత్రి-కదిరి శ్రీకాంత్ రెడ్డి
కళ్యాణదుర్గం-కరణం రాహుల్
రాప్తాడు-సాకె పవన్‌కుమార్
హిందూపురం-ఆకుల ఉమేశ్

కడప జిల్లా
పులివెందుల-తుపాకుల చంద్రశేఖర్

నెల్లూరు జిల్లా
ఉదయగిరి-మారెళ్ల గురుప్రసాద్
సూళ్లూరుపేట-ఉయ్యాల ప్రవీణ్

చిత్తూరు జిల్లా
పీలేరు: బి.దినేశ్
చంద్రగిరి: డాక్టర్ శెట్టి సురేంద్ర
Pawan Kalyan
Jana Sena
Andhra Pradesh
Anantapur District
pulivendula
Hindupuram
Balakrishna
Jagan

More Telugu News