KCR: కేసీఆర్ పై అలకబూనిన వివేక్.. ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా

  • పెద్దపల్లి సీటు ఇస్తామన్నారు
  • కానీ మాటతప్పారు
  • కేసీఆర్ పై వివేక్ అసంతృప్తి
మాజీ ఎంపీ జి. వివేక్ సీఎం కేసీఆర్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో తనకు పెద్దపల్లి టికెట్ ఇస్తామని చెప్పి మాట తప్పారని వివేక్ ఆరోపించారు. పెద్దపల్లి సీటుపై కేసీఆర్ తనకు మాటిచ్చారని, కానీ ఆయన తన హామీని నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ సలహాదారు పదవిలో కొనసాగలేనని, అందుకే రాజీనామా చేస్తున్నానని వివేక్ ప్రకటించారు.

పెద్దపల్లి లోక్ సభ స్థానాన్ని సీఎం కేసీఆర్ బోరకుంట్ల వెంకటేష్ కు కేటాయించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి వివేక్ అసంతృప్తితో ఉన్నారు. నేడు రాజీనామా ప్రకటన చేసిన ఆయన తన రాజీనామా ఆమోదించాలంటూ కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సలహాదారు పదవి వల్ల తనకు ఒరిగిందేమీలేదని, తన తండ్రి వెంకటస్వామి లాగా తాను కూడా ప్రజాసేవ చేశానని అన్నారు.
KCR
TRS
Telangana

More Telugu News