YSRCP: నగరిలో నాకు చంద్రబాబే పోటీ: రోజా

  • బరిలో ఎవరున్నా చంద్రబాబు, లోకేష్ లే ప్రత్యర్థులు
  • అసెంబ్లీలో నగరి సమస్యలపై ఎంతో పోరాడాను
  • ప్రజలందరూ నా ఫైట్ చూశారు
సినీ నటి, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమె వైసీపీ అభ్యర్థిగా మరోసారి నగరి నుంచి పోటీచేస్తున్నారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించిన అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. నగరి నియోజకవర్గంలో ఎవరు పోటీచేసినా తనకు చంద్రబాబు, లోకేష్ లే ప్రత్యర్థులని పేర్కొన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. టీడీపీ సర్కారు తన నియోజకవర్గానికి నిధులు విడుదల చేయకుండా అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. కానీ, నగరి సమస్యలపై అసెంబ్లీలో తన పోరాటాన్ని అందరూ చూశారని, ప్రజలు మరోసారి తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని రోజా ధీమా వ్యక్తం చేశారు.
YSRCP
Chandrababu
Nara Lokesh

More Telugu News