Vizag: జగన్ మాయల పకీర్: సీఎం చంద్రబాబు

  • ఈ మాయలపకీర్ ని ఆడించేది కేసీఆర్
  • నిందితుడు జగన్ ని ప్రజలు ఒప్పుకుంటారా?
  • మన రాష్ట్రానికి పెద్ద సమస్య ‘జగన్’
జగనే మాయలపకీర్ అయితే, ఈ మాయలపకీర్ ని ఆడించే గొప్ప నాయకుడు కేసీఆర్ అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్టణం జిల్లాలోని నర్సీపట్నంలో నిర్వహిస్తున్న రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, జగన్ జుట్టు కేసీఆర్ చేతిలో ఉందని అన్నారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ ని ప్రజలు ఒప్పుకుంటారా? ప్రజలకు ఆయన వల్ల లాభమేమైనా ఉందా? అని ప్రశ్నించారు.

 మన రాష్ట్రానికి పెద్ద సమస్య ‘జగన్’ అని, విశాఖలోని ప్రతి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని, ఈ ఏడాది విశాఖ జిల్లాకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ సైనికులు వీరోచితంగా పోరాడుతున్నారని టీడీపీకి ఓటేస్తే గెలుపు ప్రజలదేనని పిలుపు నిచ్చారు. తాను మళ్లీ అధికారంలోకొస్తే అన్నిపనులు చేస్తానని, అదే, వైసీపీ కనుక అధికారంలోకొస్తే అందర్నీ జైలుకు పంపిస్తారని విమర్శించారు.
Vizag
narsipatna
Telugudesam
Chandrababu
cm

More Telugu News