Mahabubabad District: టికెట్‌ నాకే అని అసెంబ్లీ ఎన్నికలప్పుడు చెప్పారు...ఇప్పుడు హ్యాండిచ్చారు: సీతారామ్‌ నాయక్‌

  • నేనేం తప్పుచేశానో అధిష్ఠానానికే తెలియాలి
  • సర్వేలు, సహకారం లేదనడం అంతా ఒట్టిమాట
  • సారు...కారు అంతా కేసీఆరే
అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్టు నాకే అని సీఎం కేసీఆర్‌ స్వయంగా భరోసా ఇచ్చారని, ఇప్పుడేమో హ్యాండిచ్చారని మహబూబాబాద్‌ ఎంపీ సీతారామ్‌ నాయక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ విడుదల చేసిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో నాయక్‌ పేరు లేని విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా నాయక్‌ మాట్లాడుతూ  నేనేం తప్పుచేశానో అధిష్ఠానానికే తెలియాలన్నారు. అడిగితే సర్వే నివేదిక బాగులేదని, ఎమ్మెల్యేలతో కో ఆర్డినేషన్‌ లేదని చెపుతున్నారని వాపోయారు. అధిష్ఠానం నిర్ణయంతో తనతో పాటు తన కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదనలో ఉన్నారని వాపోయారు. టీఆర్‌ఎస్‌లో కారు...సారూ అంతా కేసీఆర్‌ అన్నారు. ఆయననే నమ్ముకున్నానని, ఆయనే ఏదో చేయాలని కోరారు. తాను పార్టీ మారేది లేదని, తనకు రాజకీయాలు ముఖ్యం కాదని స్పష్టం చేశారు.
Mahabubabad District
seetharamnayak
TRS KCR

More Telugu News