Balakrishna: హిందూపురాన్ని బెంగళూరులా మార్చి చూపిస్తా: బాలకృష్ణ

  • నామినేషన్ వేసేందుకు వచ్చిన బాలయ్య
  • పట్టణంలో భారీ ర్యాలీ
  • అధికారంలోకి రానున్నది టీడీపీయేనని వ్యాఖ్య
భవిష్యత్తులో హిందూపురం పట్టణాన్ని మరో బెంగళూరు నగరంలా మార్చి చూపిస్తానని నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్‌ వేసేందుకు వచ్చిన ఆయన, సూగూరు ఆంజనేయస్వామి దేవాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, బడుగు బలహీన వర్గాల నుంచి పుట్టిన తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఇప్పుడు కొన్ని దుష్టశక్తులు తయారయ్యాయని విమర్శించారు. అధికారంలోకి రానున్నది టీడీపీయేనని వ్యాఖ్యానించిన ఆయన, అసెంబ్లీ ఎన్నికల్లో 150కి పైగా సీట్లు వస్తాయన్న నమ్మకముందని చెప్పారు. జిల్లాలోనే హిందూపురం అభివృద్ధిపథంలో ముందంజలో ఉందని చెప్పారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించాలని పిలుపునిచ్చారు.
Balakrishna
Hindupuram
Nomination

More Telugu News