Samanta: నా ఫొటోలు పోస్ట్ చేస్తుంటే చైతూకు నచ్చడం లేదు: సమంత సంచలన వ్యాఖ్యలు

  • 'సూపర్ డీలక్స్' ప్రమోషన్ నిమిత్తం చెన్నైకి
  • నెటిజన్ల ట్రోలింగ్ కేర్ చేయబోనని వెల్లడి
  • తనకు నచ్చిందే చేస్తున్నానన్న సమంత
నాగ చైతన్యతో వివాహమైన తరువాత కూడా సినిమాలు చేస్తూ, అప్పుడప్పుడూ తన హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ, నెటిజన్ల ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్న సమంత, తాజాగా, ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేసింది. తన చిత్రాలను ఇంటర్నెట్ లో ఎక్కువగా పోస్ట్ చేయడం భర్త నాగ చైతన్యకు నచ్చటం లేదని ఆమె చెప్పింది. అయితే, ఈ విషయంలో తనపై కోపంగా ఏమీ చైతూ లేడని, తనకు నచ్చిందే తాను చేస్తున్నానని, ఇతరుల అభిప్రాయాలను, విమర్శలను లెక్కచేయబోనని తెలిపింది.

విజయ్ సేతుపతితో కలసి నటించిన 'సూపర్ డీలక్స్' విడుదలకు సిద్ధం కాగా, ప్రమోషన్ నిమిత్తం చెన్నైకి వచ్చిన సమంత మీడియాతో మాట్లాడింది. ఈ సినిమాలో తనది వ్యాంప్ పాత్రని, దీని గురించి చైతూకు చెప్పగానే షాక్ అయ్యాడని, కానీ, తనకు కథ నచ్చడంతో అంగీకరించానని వెల్లడించింది. 'కెప్టెన్ మార్వెల్' వంటి సూపర్ ఉమెన్ స్టోరీతో ఎవరైనా తనను సంప్రదిస్తే, కచ్చితంగా నటిస్తానని వెల్లడించింది. కాగా, తెలుగులో 'ఓ  బేబీ' చిత్రంలో నటిస్తున్న సమంత, ఇది వినోద భరిత చిత్రమని, ఆది నుంచి చివరి వరకూ నవ్వుకునేలా సినిమా ఉంటుందని చెప్పుకొచ్చింది.
Samanta
Naga Chaitanya
Social Media
Hot Photos

More Telugu News