ys viveka: వివేకా హత్య కేసు.. జగన్ ముఖ్య అనుచరుడు శంకర్ రెడ్డిని ప్రశ్నిస్తున్న సిట్

  • రహస్య ప్రదేశాల్లో 40 మందిని ప్రశ్నిస్తున్న సిట్
  • కేసు విచారణ కొలిక్కి వచ్చినట్టు సమాచారం
  • ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా అరెస్ట్ లు ఉండే అవకాశం
వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సిట్ అధికారులు ముమ్మరం చేశారు. తాజాగా వైసీపీ అధినేత జగన్ ముఖ్య అనుచరుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డితో పాటు నాగప్ప, ఆయన కుమారుడు శివను సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 40 మందిని వివిధ రహస్య ప్రదేశాల్లో ప్రశ్నిస్తున్నారు. కేసు విచారణ ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది.

మరోవైపు, వివేకా హత్య జరిగిన రాత్రి 11.30 గంటల సమయంలో చిన్న అనే వ్యక్తికి చెందిన స్కార్పియో వాహనంలో చంద్రశేఖర్ రెడ్డి పులివెందులలో తిరిగినట్టు సీసీ కెమెరా ఫుటేజీల్లో పోలీసులు గుర్తించారు. హత్యకు పరమేశ్వర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డిలు ప్రధాన సూత్రధారులైతే... చంద్రశేఖర్ రెడ్డి అండ్ గ్యాండ్ ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసు విచారణలో తేలినట్టు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా అరెస్ట్ లు ఉండే అవకాశం ఉందని సమాచారం.
ys viveka
jagan
murder
sit
pulivendula

More Telugu News