Nara Lokesh: ఎన్నికల సిత్రాలు... బార్బర్ షాప్ కెళ్లి దువ్వెన, కత్తెర పట్టిన నారా లోకేశ్... వీడియో!

  • మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న నారా లోకేశ్
  • ప్రచారంలో దూసుకెళుతున్న యువనేత
  • కటింగ్ చేస్తున్న వీడియో వైరల్
ఒక్క ఓటును కూడా వదలరాదని భావించే రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారం వేళ ఎన్నెన్నో చమక్కులు చూపిస్తుంటారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు పడని పాట్లుండవు. టీ స్టాల్ కనిపిస్తే వెళ్లి టీ కాస్తారు. ఇస్త్రీ బండి కనిపిస్తే, ఇస్త్రీ చేసేస్తారు. ఆరుబయట పిల్లలకు స్నానం చేయిస్తున్న తల్లి కనిపిస్తే, వెళ్లి నీళ్లు పోసి సాయపడతారు. బార్బర్ షాప్ కనిపిస్తే వెళ్లి కటింగ్ చేసేస్తారు. చెరకు రసం మిషన్ కనిపిస్తే, రసం తీసి సాయం చేస్తారు. ఎన్నికల ప్రచారం విషయంలో అందరు రాజకీయ నాయకులకూ తానేమీ తీసిపోనని నిరూపించారు నారా లోకేశ్.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి తొలిసారి దిగిన నారా లోకేశ్, ప్రచారంలో దూసుకెళుతున్నారు. తాజాగా ఆయన, నియోజకవర్గంలోని ఓ బార్బర్ షాప్ కెళ్లి, దువ్వెన, కత్తెర పట్టుకున్నారు. అప్పటికే అక్కడ కటింగ్ చేయించుకునే నిమిత్తం కూర్చునున్న యువకుడికి కటింగ్ చేశారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.
Nara Lokesh
Mangalagiri
Barber Shop
Campaign

More Telugu News